తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యావసర సరకులు పంపిణీ చేసిన యువకులు - పెంచికలపేట మండలం వార్తలు

కరోనా కాలంలో ఆదిలాబాద్​ జిల్లా పెంచికలపేట మండలం యువకులు పలు కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

penchikal peta, essentials distribution to poor families, adilabad
penchikal peta, essentials distribution to poor families, adilabad

By

Published : May 10, 2021, 7:23 PM IST

కొవిడ్​ సమయంలో ఉపాధి లేక బాధపడుతోన్న పలు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు ఆదిలాబాద్​ జిల్లా పెంచికలపేట మండలం యువకులు. పలువురికి నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వం చాటుకుంటున్నారు.

మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుండడం వల్ల పెంచికలపేట మండలంలోని పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్​డౌన్ పాటిస్తున్నాయి. ఎల్లూరు, మేరు గూడ, కోయ చిచ్చాల గ్రామాలకు చెందిన కొంతమంది రోజువారి కూలీలు.. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయారు.

విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త తిరుపతి.. తన మిత్ర బృందంతో కలిసి ఆయా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, పప్పులతో పాటు 15 రోజులకు సరిపడా సామాగ్రిని అందజేశారు.

ఇదీ చూడండి:'మీలో మీరు బాధపడకండి.. మమ్మల్ని సంప్రదించండి'

ABOUT THE AUTHOR

...view details