తెలంగాణ

telangana

ETV Bharat / state

Viral video: నంబర్ ప్లేట్ లేదని బండి ఆపిన పోలీసులపై యువకుడు ఫైర్ - young man fires on adilabad traffic police

నంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల ద్విచక్రవాహనాన్ని అడ్డుకున్న పోలీసులపై ఓ యువకుడు తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

young man fight, young man fight with traffic police
ట్రాఫిక్ పోలీసులతో యువకుడి వాగ్వాదం, ట్రాఫిక్ పోలీసులతో యువకుడి గొడవ

By

Published : Jun 13, 2021, 11:07 AM IST

ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులకు ఎదురు తిరిగిన ఓ యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నంబరు ప్లేట్ లేదని ద్విచక్రవాహనాన్ని ఆపిన పోలీసులతో సదరు యువకుడు వాగ్వాదానికి దిగారు.

తన పేరు చెబుతూ.. ఫలానా ఏరియాలో ఉంటానని ఏం చేసుకుంటారో చేసుకోండంటూ విరుచుకుపడ్డాడు. అతనిపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

నంబర్ ప్లేట్ లేదని బండి ఆపిన పోలీసులపై యువకుడు ఫైర్

ABOUT THE AUTHOR

...view details