తెలంగాణ

telangana

ETV Bharat / state

యువతుల ర్యాంప్ వాక్ అదుర్స్ - adilabad today news

ఆదిలాబాద్ పట్టణంలో మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ అడిషన్స్​ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలువురు యువతీ యువకులు వెస్ట్రన్‌ దుస్తులు ధరించి క్యాట్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు.

Young girls ramp walkers at adilabad city
యువతుల ర్యాంప్ వాక్ అదుర్స్

By

Published : Feb 2, 2020, 5:14 PM IST

ఆదిలాబాద్ పట్టణంలో సత్యమేవ జయతే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ అడిషన్స్ నిర్వహించారు. పట్నంతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి యువతీ యువకులు వచ్చి షోలో క్యాట్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.

తమ నృత్యాలతో హోరెత్తించారు. పాటలు పాడి ఔరా అనిపించారు. ఈ ప్రదర్శనలో 200 మంది ఔత్సాహికులు పాల్గొని అలరించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రాంతీయ స్థాయిలో అవకాశం ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.

యువతుల ర్యాంప్ వాక్ అదుర్స్

ఇదీ చూడండి :తల్లి మందలించిందని... తనువు చాలించింది

ABOUT THE AUTHOR

...view details