గత కొన్నేళ్లుగా ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తుడుం దెబ్బ అదిలాబాద్ జిల్లా కార్యదర్శి బాబురావు డిమాండ్ చేశారు. జిల్లాలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివాసి తండాల్లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డోలు, వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
'ఆదివాసీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి' - World Tribal Day celebrations in adilabad district
గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని తుడుం దెబ్బ అదిలాబాద్ జిల్లా కార్యదర్శి బాబురావు డిమాండ్ చేశారు. జిల్లాలోని పలు తండాల్లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆదివాసీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి
ఇప్పటికైనా గిరిజనుల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని కోరారు. వ్యవసాయ భూమి లేని వారికి భూములు ఇచ్చి సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పేర్కొన్నారు. జీవో నంబరు 3ను యథావిధిగా పునరుద్ధరించాలన్నారు.
ఇదీ చూడండి:'కాపాడే క్రమంలో తెలిసింది..వీరంతా కరోనా బాధితులని'