ఆదిలాబాద్ పట్టణం రణదివేనగర్లోని మద్యం దుకాణంపై మహిళలు దాడి చేశారు. దుకాణంలోని మద్యం సీసాలను రోడ్డుపై పగలగొట్టారు. మద్యం విక్రయాలతో పేద కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని పలుమార్లు చెప్పిన పట్టించుకోకపోవడం వల్ల దాడికి పాల్పడినట్లు వారు వాపోయారు.
"మా కుటుంబాలు వీటి వల్ల నాశనమయ్యాయి" - latest news of adilabad
తమ కుటుంబాలు మద్యం అమ్మకాల వల్ల చిన్నాభిన్నం అయ్యాయంటూ కొంత మంది మహిళలు ఆదిలాబాద్‌లోని రణదివేనగర్లోని బెల్ట్‌షాపుపై దాడి చేశారు. దుకాణం తెరిచి విక్రయాలు జరిపితే ఊరికునేది లేదంటూ హెచ్చరించారు.
!["మా కుటుంబాలు వీటి వల్ల నాశనమయ్యాయి" women attack on belt shops at adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7905153-1014-7905153-1593956958334.jpg)
"మా కుటుంబాలు వీటి వల్ల నాశనమయ్యాయి"
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై విక్రయాలు జరిపితే దుకాణంపై దాడిచేసి మూసివేస్తామని హెచ్చరించారు.