విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కృషి వెలకట్టలేనిదని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్ కొనియాడారు. గురువును మించిన దైవం లేదని అన్నారు. జిల్లాలోని ఉట్నూరులో టీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర మహాసభ- విద్యాసదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : జనార్దన్
భావిపౌరులను తీర్చిదిద్దడంలో గురువులు ప్రథమస్థానంలో నిలుస్తారని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్ అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర మహాసభ- విద్యాసదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : జనార్దన్
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి మనిషి మంచిమార్గంలో నడవాలంటే విద్య అనివార్యమని తెలిపారు. విద్యను అందించే గురువులను ఎప్పటికీ మరువలేమని జడ్పీ ఛైర్మన్ పేర్కొన్నారు.