ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అశోక్ నగర్ కాలనీలో తాగు నీరు రావట్లేదని కాలనీ వాసులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కొన్ని కాలనీలకు మిషన్ భగీరథ నీరు అందుతుండగా..తమకు చుక్క నీరు సరఫరా చేయట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
నీటి కోసం ఇతర కాలనీలకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తక్షణమే ఆయా శాఖాధికారులు స్పందించి నీటిని సక్రమంగా అందించాలని కోరారు. మండుటెండలో నీటి కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పని తాగునీటి తిప్పలు ! ! - mission bagiratha
తమ కాలనీకి తాగు నీరు సరఫరా చేయట్లేదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల వాసులు ఆందోళన చేపట్టారు. వెంటనే తమకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

నీటి కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు
తాగు నీరు సరఫరా చేయట్లేదని ఆందోళన
ఇవీ చూడండి : మా భూములకు సరైన ధర కట్టండి