భావితరాలకు మేలు జరగాలంటే నీటి సంరక్షణ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ జజు పేర్కొన్నారు. జలశక్తి అభియాన్ కార్యక్రమం అమలులో భాగంగా ఆదిలాబాద్‌లోని జడ్పీ హాలులో ఏర్పాటు చేసిన సమావేశానికి సంజయ్ హాజరయ్యారు. జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్, జిల్లాలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించాలని సంజయ్ సూచించారు.
నీటి సంరక్షణ సామాజిక బాధ్యత... - WATER PROTECTION MEETING IN ADHILABAD
ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించాలని కేంద్రం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ జజు సూచించారు. ఆదిలాబాద్ జడ్పీ హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
![నీటి సంరక్షణ సామాజిక బాధ్యత...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3733612-683-3733612-1562153227909.jpg)
WATER PROTECTION MEETING IN ADHILABAD