తెలంగాణ

telangana

ETV Bharat / state

మాటకు మాట: 'అసలైన అవినీతిపరుడు జోగు రామన్నే' - mla jogu ramanna latest news

ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్‌ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్‌లపై ఎమ్మెల్యే జోగురామన్న చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా పాయల్‌ శంకర్‌ స్పందించారు. అసలైన అవినీతి పరుడు జోగురామన్న అంటూ ధ్వజమెత్తారు. తాము అవినీతికి పాల్పడితే విచారణ జరిపించాలంటూ సవాల్‌ విసిరారు.

War between BJP and Trs leaders in adilabad
మాటకు మాట: 'అసలైన అవినీతిపరుడు జోగు రామన్నే'

By

Published : Dec 24, 2020, 2:58 PM IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన అనంతరం భాజపా, తెరాస నేతల నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. భాజపా ఎంపీ సోయం బాపురావు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌ల అవినీతి చిట్టాను బయటపెడతానని తెరాస ఎమ్మెల్యే జోగు రామన్న బుధవారం మీడియా సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇందుకు ప్రతిగా భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ జోగురామన్నపై మాటల యుద్ధానికి దిగారు. అసలు అవినీతి పరుడు జోగురామన్ననే అంటూ ధ్వజమెత్తారు. అధికారుల నుంచి, గుత్తేదారుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి తానేమీ అధికారంలోలేనని, తాను గానీ, ఎంపీ సోయం బాపురావు గానీ అవినీతికి పాల్పడితే విచారణ జరిపించాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.

ఇదీ చూడండి: 'భాజపా నేతలు బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మానుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details