ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసీకే అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సోమవారం అటవీ ప్రాంతంలో హతమైన లేగ దూడ... పులి దాడిలోనే మృతి చెందినట్లు అటవీ అధికారులు నిర్ధరించారు. మహారాష్ట్ర సరిహద్దు అభయారణ్యం నుంచి పులి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
తాంసీకే అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం
భీంపూర్ మండలం తాంసీకే అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాంసీకే అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం
పెన్‌గంగా నది పరివాహక ప్రాంతాల్లో పులి కదలికల కోసం గాలింపు ముమ్మరం చేశారు. పశువులను అడవిలోకి తీసుకెళ్లొద్దని సూచించారు. పెద్దపులి సంచారంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చూడండి:హైదరాబాద్‌లో మంచినీటి సరఫరాకు అంతరాయం