ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడకు చెందిన మడావి సోన్‌దేవి గురుకులంలో ఇంటర్ చదువుతూ కొవిడ్ బారిన పడింది. గ్రామానికి వచ్చిన ఆమెను గ్రామస్థులు ఊళ్లోకి రానివ్వలేదు. గత్యంతరం లేక ఊరి చివరనున్న తమ పొలంలోనే ఆమె ఐసొలేషన్‌లో ఉంటూ రాత్రుళ్లు చిమ్మ చీకట్లో గడుపుతోంది.
ఊరంతా ససేమిరా.. పొలంలోనే కొవిడ్ బాధితురాలు - ఆదిలాబాద్ జిల్లా వార్తలు
కొవిడ్ సోకిన ఓ విద్యార్థినిని గ్రామంలోకి రాకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. చేసేదేం లేక ఊరి చివరనున్న తమ పొలంలోనే ఆమె ఐసొలేషన్‌లో ఉంటోంది. క్వారంటైన్ పూర్తయిన తర్వాతే గ్రామంలోకి అనుమతిస్తామని పంచాయతీ పెద్దలు తెల్చి చెప్పారు.
covid
ఏటీడబ్ల్యూఓ క్రాంతికుమార్, గురుకులం ఆర్‌సీఓ గంగాధర్ ఆమెను సోమవారం పరామర్శించారు. గ్రామంలోకి బాలికను అనుమతించాలని పంచాయతీ పెద్దలతో రాత్రి ఎనిమిది గంటల వరకు చర్చించారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరో నాలుగు రోజులు గడిస్తే క్వారంటైన్ పూర్తవుతుందని, అప్పుడే గ్రామంలోకి అడుగు పెట్టనిస్తామని వారు తేల్చి చెప్పడంతో ఆ యువతి పొలంలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి :కరోనా నిబంధనలు మరింత కఠినతరం.. నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్
Last Updated : Mar 30, 2021, 8:35 AM IST