తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లి కోసం రోడ్డు... ఊరంతా నడుం బిగించారు! - తెలంగాణ వార్తలు

ఆదిలాబాద్​ జిల్లాలోని ఓ ఆదివాసీ గూడెం అది. ఇటీవల గ్రామపంచాయతీగా మారినా సరైన రోడ్డు లేదు. కష్టంగా ఎడ్లబళ్లపై వెళ్లిరావడమే తప్ప ఇతర వాహనాల రాకపోకలకు మార్గమే లేదు. ఏ శుభకార్యం చేసినా ఆ గూడెంలోకి బంధువులు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. అందుకే రేపు జరగనున్న ఓ పెళ్లి కోసం గ్రామస్థులంతా నడుం బిగించారు.

road for marriage in girjay gudem, adilabad district news ,
రోడ్డు వేస్తున్న గ్రామస్థులు, పెళ్లి కోసం రోడ్డు వేసిన గిర్జాయిగూడెం వాసులు

By

Published : Mar 31, 2021, 4:50 PM IST

రోడ్డు వేస్తున్న గ్రామస్థులు, పెళ్లి కోసం రోడ్డు వేసిన గిర్జాయిగూడెం వాసులు

రవాణా సౌకర్యంలేని ఓ మారుమూల పల్లెలో జరిగే పెళ్లికి వచ్చే బంధువుల కోసం గ్రామస్థులంతా నడుంబిగించి రోడ్డును వేసుకున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బజార్‌హత్నూర్‌ మండలంలో మారుమూలన ఉన్న గిర్జాయి అనే గూడెం ... ఇటీవల నూతన గ్రామపంచాయతీగా అవతరించినప్పటికీ... రోడ్డు సౌకర్యం లేదు. కష్టంగా ఎడ్లబళ్లపై వెళ్లిరావడమే తప్ప... ఇతర వాహనాల రాకపోకలు సాగించడానికి సరైన మార్గమే లేదు. ఇదే గ్రామంలో ఏప్రిల్ ఒకటిన హన్మంతు అనే యువకుడికి ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం బండగూడకు చెందిన వధువుతో పెళ్లి జరగాల్సి ఉంది.

రోడ్డు వేస్తున్న గ్రామస్థులు, పెళ్లి కోసం రోడ్డు వేసిన గిర్జాయిగూడెం వాసులు

బంధువుల వాహనాలు రావాలంటే మట్టితోవ ఇబ్బందికరంగా ఉందని గమనించిన గ్రామస్థులంతా నడుం బిగించారు. అడ్డదిడ్డంగా ఉన్న రాళ్లబండలను తొలగిస్తూ... రాకపోకలకు అనుకూలంగా మార్చుకున్నారు. అధికారులు స్పందించడం లేదనీ, ప్రజాప్రతినిధులు విస్మరించారని ... పట్టించుకోకుండా గ్రామస్థులే ఐక్యంగా రహదారి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలిచారు.

ఇదీ చదవండి:టీ పొడి అనుకొని ఎండ్రిన్​ వేసుకుని.. మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details