దేశంలో అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా మేనేజర్ ధనుంజయ్ రావు అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
'అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలి'
దేశంలో ప్రతిఒక్కరు అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా మేనేజర్ ధనుంజయ్ రావు అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా టోల్ ప్లాజా సిబ్బందికి ఆయన సూచించారు.
'అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలి'
వచ్చేనెల రెండో తేదీ వరకు జరిగే వారోత్సవాల్లో ఉద్యోగులందరూ పాల్గొనాలని ఆయన కోరారు. నిజాయతీతో పనిచేయాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ హేమంత్ కుమార్, పీఆర్వో స్వామి, టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.