రాష్ట్ర మహాసభల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో యూటీఏఫ్ సన్నాహక సదస్సు నిర్వహించారు. డైట్ కళాశాలలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి చావ రవి హాజరయ్యారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్, శ్రీనివాస్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్ రావు, కోశాధికారి కిష్టన్న, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్లో యూటీఎఫ్ సదస్సు - యూటీఏఫ్ సన్నాహక సదస్సు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో యూటీఏఫ్ సన్నాహక సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా ఆ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి చావ రవి హాజరయ్యారు.
యూటీఎఫ్ సదస్సు