నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు మాత్రమే రాద్ధాంతం చేస్తున్నాయని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఆదిలాబాద్‌లో భాజపా జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్‌తో కలసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రేపు ఆదిలాబాద్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి: ఎంపీ సోయం - Kishan Reddy visit adilabad tuesday
కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాతం చేస్తున్నాయని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రేపు(మంగళవారం) ఆదిలాబాద్‌కు కేంద్ర మంత్రి కిషన్ రానున్నారని తెలిపారు.
రేపు ఆదిలాబాద్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నూతన వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించేందుకు రేపు(మంగళవారం) ఆదిలాబాద్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని సూచించారు.
ఇదీ చూడండి :వరంగల్ నగర అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష