ఆర్టీసీ సమ్మె ప్రయాణికులకే కాదు నిరుద్యోగులకు తిప్పలు తెచ్చిపెడుతోంది. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకానికి ఆర్టీసీ అధికారుల ప్రకటనలు చూసి వేకువజామున నిరుద్యోగులు డిపోల ముందు బారులు తీరుతున్నారు. నిరుద్యోగులు రోజూ ఉదయం యథావిధిగా డిపో ముందు వరుస కడుతున్నారు. గంటల తరబడి నిరీక్షించిన తమను విధుల్లోకి తీసుకోకుండా వెనక్కి పంపించారని నిరసన వ్యక్తం చేశారు. నియామకాల విషయంలో పోలీసులు తమ సొంత వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
ఆర్టీసీ ఉద్యోగానికై నిరుద్యోగుల పడిగాపులు - Unemployed millennials for RTC jobs In Adilabad district
గత రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వల్ల ప్రయాణికులకే కాదు... నిరుద్యోగులకూ తిప్పలు వచ్చిపడుతున్నాయి. నియామకాల్లో అధికారులు తమ సొంత వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
ఆర్టీసీ ఉద్యోగానికై నిరుద్యోగుల పడిగాపులు
TAGGED:
TSRTC Latest news