ఉగాది అంటే ఉదయన్నే లేస్తారు. బొబ్బట్లు, పచ్చడి చేస్తారు. దేవుడికి నైవేద్యం పెడతారు. తర్వాత పంచాంగ వింటారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు ఉగాదిని భిన్నంగా చేస్తారు. వారు ఉగాదిని వ్యవసాయ పనుల ప్రారంభానికి శుభ సూచకంగా భావిస్తారు.
ఉగాది నాడు ఎడ్లునాగలితో రైతన్నల పొలంబాట - ఉగాది తాజా వార్తలు
ఉగాదిని ఒక్కో చోటు ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇలానే ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రైతులు కాస్త భిన్నంగా జరుపుతారు. ఉగాదిని ఎలా జరుపుతారో చూద్దాం పదండి.
ఉగాది
రైతులు వేకువజామున నిద్ర లేచి బసవన్నలను అలంకరించి పొలంబాట పడతారు. అక్కడ తమ ఇష్ట దైవాలకు పూజలు చేసి లాంఛనంగా పనులు మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు మండలాలయినా భీంపూర్, జైనత్, బేలా, తాంసి, తలమడుగు తదితర ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
ఇదీ చదవండి:టీకా వేయించుకున్నా నిబంధనలు పాటించాలి: ఎర్రబెల్లి
Last Updated : Apr 13, 2021, 7:06 PM IST