ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. బేల గ్రామానికి చెందిన దేవిక, జునోని గ్రామానికి చెందిన ప్రేమల కలిసి సదల్‌పూర్ శివారులో వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తలదాచుకునేందుకు వేపచెట్టుకిందకు వెళ్లారు. ఇంతలోనే పిడుగుపడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చెట్టుకింద విగతజీవులుగా పడి ఉన్న మృతులను చూసి గ్రామస్థులు కంటతడిపెట్టారు.
పిడుగుపడి ఇద్దరు మహిళల మృతి - Two Womens Died in Adilabad district due to Thunder strome
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఇవాళ మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి పిడుగుపడటం వల్ల ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.

పిడుగుపడి ఇద్దరు మహిళల మృతి
TAGGED:
పిడుగుపడి ఇద్దరు మహిళల మృతి