తెలంగాణ

telangana

ETV Bharat / state

వెనుకనుంచి లారీ ఢీకొన్న మరో లారీ... ఇద్దరి దుర్మరణం - రోడ్డు ప్రమాదం వార్తలు

రాంపూర్​ బైపాస్ రోడ్డు వద్ద... రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. లారీ క్యాబిన్​లో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు బయటకు తీసి... నిమ్స్ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

two-members-died-in-road-accident-in-adilabad
వెనుకనుంచి లారీ ఢీకొన్న మరో లారీ... ఇద్దరి దుర్మరణం

By

Published : Aug 31, 2020, 10:39 AM IST

ఆదిలాబాద్​లోని రాంపూర్​ బైపాస్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బైపాస్​ వద్ద ఆగి ఉన్న లారీని... వెనుక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక లారీలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

ప్రయాణికుల సమాచారం మేరకు... పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ క్యాబిన్​లో ఉన్న మృతదేహాలను బయటకు తీసి... పోస్టుమార్టం నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్​కు చెందిన వారిగా గుర్తించారు.

వెనుకనుంచి లారీ ఢీకొన్న మరో లారీ... ఇద్దరి దుర్మరణం

ఇదీ చూడండి:సినీ పరిశ్రమతో డ్రగ్స్​ ముఠా లింకులపై ఆరా

ABOUT THE AUTHOR

...view details