ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా విస్తరిస్తోంది. తాజాగా ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు అటవీ అధికారులు వేరువేరు చోట్ల విధులు నిర్వర్తిస్తూ.. మహమ్మారి బారినపడి మృతి చెందారు.
కరోనా బారినపడి ఇద్దరు అటవీ అధికారుల మృతి - corona in adilabad
కరోనాసోకి ఇద్దరు అటవీ అధికారులు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరూ ఒక్కరోజే చనిపోవడంతో వారి స్వస్థలమైన భీంపూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
![కరోనా బారినపడి ఇద్దరు అటవీ అధికారుల మృతి Two forest officials were died with a corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11392678-942-11392678-1618330620191.jpg)
జిల్లాలోని భీంపూర్ గ్రామానికి చెందిన రాఠోడ్ ఈశ్వర్ (50) ఆదిలాబాద్ సెక్షన్ అధికారిగా విధులు నిర్వర్తిస్తుండగా.. జాదవ్ సునీల్ (36) నేరడిగొండ గ్రామంలో బీట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. వీరిద్దరికీ కొన్నిరోజుల క్రితం కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు అధికారులు ఒక్కరోజే చనిపోవడంతో భీంపూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అధికారుల మృతిపై జిల్లా పరిషత్ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియల కోసం మృతదేహాలను రిమ్స్ నుంచి భీంపూర్‌కు తరలించారు.