తెలంగాణ

telangana

ETV Bharat / state

Flood Effect: వాగులో కిలోమీటర్ దూరం​ కొట్టుకుపోయారు.. ప్రాణాలతో బయటపడ్డారు - Flood Effect

ఇద్దరు సోదరులు పొలానికి వెళ్లారు. వర్షం వల్ల సాయంత్రం అక్కడే చిక్కుకుపోయారు. తగ్గాక ఎడ్ల బండి కట్టుకుని, మరో జత ఎడ్లతో ఇంటి బాట పట్టారు. మార్గమధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేస్తామనే నమ్మకంతో నీళ్లలో దిగారు. కట్​ చేసే.. కిలో మీటర్​ దూరంలో ఉన్న గ్రామస్థుల సాహసంతో ప్రారణాలతో బతికి బయటపడ్డారు.

two brothers wasted away in river in shankarapur
two brothers wasted away in river in shankarapur

By

Published : Sep 5, 2021, 10:31 AM IST



ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం శంకరాపూర్​కు చెందిన ఇద్దరు పిల్లలు రజనీకాంత్(12), కృష్ణ(14) తమ సమీపంలోని పంట పొలానికి వెళ్లారు. సాయంత్రం భారీగా వర్షం కురవగా.. తగ్గేవరకు అక్కడే వేచిచూశారు. వర్షం తగ్గుముఖం పట్టగానే.. రెండు ఎడ్ల జతలతోపాటు ఎడ్లబండి కట్టుకొని ఇంటికి బయల్దేరారు భారీ వర్షానికి గ్రామ సమీపంలోని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

వాగు ప్రవాహ ఉద్ధృతిని అంచనా వేయలేని రజనీకాంత్​, కృష్ణ.. దాటేందుకు ప్రయత్నించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల బండితో సహా.. కొట్టుకుపోయారు. దాదాపు కిలోమీటర్ దూరం కొట్టుకుపోగా... గమనించిన గ్రామస్థులు కష్టపడి వాళ్లను కాపాడారు. వాగులో కొట్టుకుపోయిన రెండు జతల ఎడ్లలో ఒక ఎద్దు చనిపోయింది. ఎట్టకేలకు ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details