ఆదిలాబాద్ మండలం చాందా(టి) గ్రామానికి చెందిన ఆరె చంటన్న తలమడుగు మండలం కుచులాపూర్ నుంచి ద్విచక్రవాహనం మీద ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. టిప్పర్ అతని తల మీద నుంచి వెళ్లగా... అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
ఒకే రహదారిపై రెండు వేర్వేరు ప్రమాదాలు, ఒకరు మృతి - ఒకే రహదారిపై రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు
తలమడుగు మండలం సుంకిడి -సాయి లింగి గ్రామాల మధ్య రహదారిపై జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఒకే రహదారిపై రెండు వేర్వేరు ప్రమాదాలు, ఒకరు మృతి
మరో ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు యువకులు బైక్ మీద వెళ్తుండగా... మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:త్రివిధ దళాల్లో...త్రిబుల్‌స్టార్