ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. వ్యాపార, వాణిజ్యవర్గాలు స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపాయి. జిల్లాలోని ఆరు డిపోల పరిధిలోని 624 ఆర్టీసీ బస్సులు బయటకురాలేదు.
ఆదిలాబాద్లో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు - ఆదిలాబాద్లో ఆర్టీసీ సమ్మె
ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్కు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం నుంచే అఖిలపక్ష నేతలు, ఆర్టీసీ ఐకాస నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిపోల వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నిచోట్ల ముందస్తు అరెస్టు చేశారు.
adilabad bundh