'తక్షణమే టీఆర్టీ నియామకాలు చేపట్టండి' - adilabad
టీఆర్టీ నియామకాలు వెంటనే చేపట్టాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయ అభ్యర్థులు ధర్నాకు దిగారు.
టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట డీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ అభ్యర్థులు ధర్నాకు దిగారు. టీఆర్టీ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నియమాకాల్లో జాప్యంపై ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ నినాదాలు చేశారు. పాఠశాలలు తెరిచే సమయం దగ్గర్లో ఉన్నందున వెంటనే ఆదేశాలు చేయాలని... లేదంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.