తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి జలాలతో నాగోబాకు తిరుగు ప్రయాణం - aadilabad indravelli updates

నాగోబా జాతరకు ఆదివాసీలు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మెస్రం వంశస్థుల జన్నారం మండలం కలమడుగులోని హస్తిన మడుగు చేరుకొని కఠోడా ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tribals are making arrangements for the Nagoba fair
గోదావరి జలాలతో నాగోబాకు తిరుగు ప్రయాణం

By

Published : Jan 31, 2021, 9:40 AM IST

ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా నిర్వహించే నాగోబా జాతరకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈనెల 21న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నుంచి గోదావరి జలాల కోసం కాలి నడకన వెళ్లిన మెస్రం వంశస్థులు తిరుగు ప్రయాణమయ్యారు.

ప్రత్యేక పూజలు నిర్వహించారు..

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులోని హస్తిన మడుగు చేరుకొని కఠోడా ఆధ్వర్యంలో.. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి జలాలను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మూడు రోజులలో ఇంద్రవెల్లి చేరుకొని గోదావరి జలాన్ని భద్రంగా ఉంచి.. ఫిబ్రవరి 11న నిర్వహించే మహా పూజకు కేస్లాపూర్ నాగోబా ఆలయం చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:మీడియా పోరాటం అభినందనీయం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details