Tribal Students Archery In Adilabad : చించుఘాట్ ఇది బాహ్య ప్రపంచానికి తెలియని ఆదివాసీ పల్లె ఇది. ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలోని మారుమూల ప్రాంతం. ఇక్కడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దేశానికి పేరు తీసుకురావాలనే గొప్ప సంకల్పం ఉంది. ఆధునిక ఆటలంటే అంతగా తెలియని గిరిజన, ఆదివాసీ విద్యార్థులకు ఆర్చరీ(Archery) అదే విలువిద్య అంటే ఆసక్తి ఉంది. దీన్ని గమనించిన పాఠశాల యాజమాన్యం మారుతి అనే ఆదివాసీ నిరుద్యోగ పట్టభద్రుడితో ఏడాది కిందట నలుగురు విద్యార్థులతో ఆర్చరీ శిక్షణ ఏర్పాటు చేశారు.
"నాకు ఆర్చరీ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాం. ఆర్చరీ చేయాలని అభిలాష చిన్నప్పటి నుంచి ఉంది. మాకు సపోర్ట్ చేసి, శిక్షణ ఇస్తున్న మారుతీ సార్కు కృతజ్ఞతలు. మా గురువుకు మంచి పేరు తెస్తాం. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి ఆడాలని ఉంది. భవిష్యత్తులో ఆర్చరీలో అభిరుచి ఉన్నవారిని తయారు చేస్తాం." - విద్యార్థులు
Skating Player Rishita Story : 'స్కేటింగ్లో రాణించింది.. మానసిక వైకల్యాన్ని జయించింది'
Adivasi Students Excelling in Archery :ఏడాది కాలంలోనే బాలబాలికల విభాగంలో జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదిగారు. అందుబాటులో ఉన్న క్రీడా పరికరాలే ఆధారంగా శిక్షణ తీసుకుంటున్నారు.వాస్తవంగానైతే ఆర్చరీ శిక్షణ తీసుకునే విద్యార్థులకు పౌష్టికాహారమైన భోజనం అందించాలి. కానీ అలాంటిదేమీ ఇక్కడ లేదు. ఆశ్రమ పాఠశాలలో వండే భోజనమే పరమాన్నమవుతోంది. కానీ ఆటపై ఉన్న మక్కువతో పాఠశాల పీటీ రవీందర్, శిక్షకుడు మారుతి చొరవ తీసుకొని ఉచితంగానే శిక్షణ ఇవ్వడం విద్యార్థుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.