ఊరికి దూరంగా.. అడవితల్లి ఒడిలో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న ఆదివాసీ వృద్ధురాలు పూసం గిరిజాబాయి(85) ఇకలేరు. వన్యప్రాణుల మధ్య 32 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా ఉంటున్న ఆమె అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. 52 ఏళ్ల క్రితం గిరిజాబాయి ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం ఖైరదట్వా నుంచి బతుకుదెరువు కోసం భర్త జైతుతో వచ్చి ఉట్నూరు మండలం కాన్నాపూర్ అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు.
అనారోగ్యంతో ఆదివాసీ వృద్ధురాలి మృతి - అడవిలో అవ్వ మృతి
పట్టణానికి దూరంగా అడవిలో నివసించే ఆదివాసీ వృద్ధురాలు పూసం గిరిజాబాయి(85) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా కాన్నాపూర్ అటవీ ప్రాంతంలో ఆమె గత 32 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా ఉండేది. ఆ వృద్ధురాలు అడవిలో దొరికే ఆహారం తింటూ జీవించేది.
అనారోగ్యంతో ఆదివాసీ వృద్ధురాలి మృతి
కొంతకాలానికే భర్త అనారోగ్యంతో చనిపోయారు. అనంతరం కుమారుడు రాముతో కలిసి పోడు సాగు చేస్తూ జీవనం సాగించారు. 32 ఏళ్ల క్రితం అతనూ మరణించడంతో అప్పటి నుంచి... కన్నాపూర్ రాజులమడుగు అటవీ ప్రాంతంలోని ఓ చెట్టు కింద స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. అడవిలో దొరికే కందలు, గడ్డలు తింటూ జీవనం సాగిస్తున్నారు. ఆమెకు గోండు భాష మాత్రమే తెలుసు.
ఇదీ చూడండి:ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ.. 20 మందికి తీవ్రగాయాలు