ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలకు సాంస్కృతికి పెట్టింది పేరు. వారీ జీవనశైలీ.. ఆచార వ్యవహారాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆధునిక నాగరికతకు వారు చాలా భిన్నం. కానీ వారు ప్రేమలకు ఆదివాసీ జీవనానికి పట్టుకొమ్మలు. అయితే ఒక్కోసారి వారి అమాయకత్వమో.. మూఢనమ్మకమో తెలియదు కానీ.. పదిరోజుల క్రితం వారి ఆరాధ్యదైవమైన భీమ్దేవుడు జంగుమాతకు చేసే పూజా కార్యక్రమాల్లో ఏదో తప్పిందం జరిగిందంటూ ఉట్వూరు మండలం రామ్‌గూడలోని కారోబార్ రామ్‌చందర్ ఇంటిని కూల్చివేసి వారిని వెలివేశారు.
తాము ఎప్పుడూ ఇలానే చేస్తామని ఆచారవ్యవహారాల్లో ఎటువంటి తప్పిదం చేయలేదంటూ గ్రామ పెద్దలకు ఊరి ప్రజలకు రామ్ చందర్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. రామ్‌చందర్ కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా లాభం లేకుండా పోయింది. అపచారం జరిగిందని ఊరిని వదిలివెల్లాల్సిందేనని ఆదేశించారు. దానితో దిక్కు తోచని స్థితిలో అతను కుటుంబ సభ్యులతో సహా సమీపంలోని ఏందా గిరిజన గ్రామంలోని వ్యవసాయ భూముల్లో చిన్న గుడిసె వేసుకుని ఆశ్రయం పొందుతున్నాడు.