కరీంనగర్‌కు బదిలీ అయిన డీడీ నాగరాజు తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. జిల్లా ఖజానా కార్యాలయంలోని ఓ మహిళ ఉద్యోగితో కలిసి ప్రస్తుత డీడీ, మరో అధికారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించడం పట్ల ఆందోళనకు దిగారు. బెదిరింపులకు పాల్పడుతున్న నాగరాజును సస్పెండ్ చేయాలని ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు నాగరాజు తమను తూడా వేధిస్తున్నాడంటూ ఉద్యోగులు సైతం పీఎస్‌ను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
బదిలీ డీడీ నిర్వాకం... ట్రెజరీ ఉద్యోగుల విధుల బహిష్కరణ - ఆదిలాబాద్‌లో డీడీ నిర్వాకం
ఆదిలాబాద్ జిల్లా నుంచి బదిలీ అయిన డీడీ నాగరాజు నిర్వాకంతో ఖజానా ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఓ మహిళ ఉద్యోగితో ప్రస్తుత డీడీ, మరో అధికారిపై పీఎస్‌లో ఫిర్యాదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. తమను సైతం వేధిస్తున్నాడంటూ ఉద్యోగులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

విధులు బహిష్కరించిన ఆదిలాాబాద్ ఖజానా ఉద్యోగులు
ఉద్యోగుల విధుల బహిష్కరణతో కార్యాలయ గదులు తాళాలతో దర్శనమిచ్చాయి. ఆయా బిల్లుల ఆమోద ప్రక్రియ నిలిచిపోయింది. సదరు మహిళ ఉద్యోగి తన ఫిర్యాదును వెనక్కి తీసుకునేదాకా తమ ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ట్రెజరీ అధికారి రాజేశ్వర్ పేర్కొన్నారు. మహిళను తానేమి వేధించలేదని ఆయన తెలిపారు.