తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ రహదారిపై బోల్తాపడిన టవేరా - gudihatnoor

అతివేగం, అజాగ్రత వల్ల ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జాతీయ రహదారిపై ఏడుగురితో ప్రయాణిస్తున్న టవేరా వాహనం బోల్తా పడింది.

బోల్తాపడిన టవేరా

By

Published : May 30, 2019, 10:02 AM IST

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై టవేరా వాహనం బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న వాహనంలో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ వేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్ల జాతీయ రహదారిపై వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్​లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు.

బోల్తాపడిన టవేరా

ABOUT THE AUTHOR

...view details