తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు ఉట్నూర్​లో ఇప్పపువ్వు పండుగ

ఆదిలాబాద్​ సువిశాలమైన అడవులకే కాదు.. రుచికరమైన ఇప్పపువ్వు వంటలకు కీర్తి ఘడించింది. ఉట్నూర్​ ఏజెన్సీలో ప్రతి ఏడాది ఇప్పపువ్వు పేరుతో పండుగ నిర్వహిస్తారు. ఈ పువ్వుతో అనేక వంటకాలు చేస్తారు. ఇవాళ ఉట్నూరు మండల కేంద్రంలోని కుమురం భీం ప్రాంగణంలో ఈ మహోత్సవం జరగనుంది.

నేడు ఉట్నూర్​లో ఇప్పపువ్వు పండుగ

By

Published : May 31, 2019, 6:14 AM IST

Updated : May 31, 2019, 12:20 PM IST

రాష్ట్రంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. భోజన ప్రియులకు హైదరాబాద్​ అంటే గుర్తొచ్చేది బిర్యానీ.. అలా సువిశాలమైన అడవులు కలిగి ఉన్న ఆదిలాబాద్​ జిల్లాకూ ఓ ప్రత్యేకత ఉంది. ఆదివాసీల సంప్రదాయాలను నేటికి కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఉట్నూర్​ ఏజెన్సీ ప్రాంతం. అడవుల్లో లభించే ఇప్పచెట్టు పువ్వును సేకరించి రొట్టెలు, లడ్డూలు, ఫ్రై, గారెలు లాంటి పలు రకాల ఆహార పదార్థాలను తయారుచేస్తున్నారు అక్కడి ప్రజలు.

నేడు ఉట్నూర్​లో ఇప్పపువ్వు పండుగ

ప్రతి సంవత్సరం ఇప్ప పువ్వు పండగ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఇక్కడి ప్రజలు. ఈ విషయం తెలుసుకొన్న జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్​ వారందరిని ఒక చోట చేర్చారు. ప్రజామిత్ర సహకార సంఘంగా నమోదు చేయించారు. ఈ ఏడాది ఇప్పు పువ్వు పండుగ నిర్వహించాలని సూచించారు.

నేడు ఇప్ప పువ్వు పండుగ

ఇవాళ ఉట్నూరు మండలంలోని కుమురం భీం ప్రాంగణంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందు కోసం ఇప్పపువ్వుతో అనేక రకాల ఆహార పదార్థాలు చేసే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు.

ఇవీ చూడండి: కేంద్ర సహాయమంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

Last Updated : May 31, 2019, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details