తెలంగాణ

telangana

By

Published : Sep 24, 2020, 4:07 PM IST

ETV Bharat / state

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి: కార్మిక సంఘాలు

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట కార్మిక సంఘాల ఐకాస ధర్నా చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించింది.

JAC dharna of trade unions in front of Adilabad Collectorate
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి: కార్మిక సంఘాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట కార్మిక సంఘాల ఐకాస ధర్నా చేపట్టింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, కనీస వేతనం రూ.21వేలు చెల్లించాలని డిమాండ్​ చేసింది.

కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న వారికి రూ.50లక్షల బీమాతో పాటు సెలవులతో కూడిన వేతనం ఇవ్వాలనే డిమాండ్లను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు.

ఇదీ చూడండి:సరిహద్దుల్లో వంతెనలను ప్రారంభించనున్న రాజ్​నాథ్​

ABOUT THE AUTHOR

...view details