తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి యాజమాన్యంపై కార్మిక సంఘం ఆగ్రహం - సింగరేణి యాజమాన్యంపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆగ్రహం

లాక్​డౌన్​ నేపథ్యంలో కార్మికులపై సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న ధోరణిపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి విమర్శలు గుప్పించారు. జగతికి వెలుగులు పంచే చీకటి సూర్యులకు వేతనాల్లో కోతలు విధించి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని హెచ్చరించారు. యాజమాన్యం స్పందించి మార్చి నెలలోని పూర్తి, ఏప్రిల్ నెలలోని లే ఆఫ్ వేతనాలను చెల్లించాలని మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.

Trade union Anger over on Singareni Ownership
సింగరేణి యాజమాన్యంపై కార్మిక సంఘం ఆగ్రహం

By

Published : Apr 26, 2020, 5:41 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం... కార్మికులపై అనుసరిస్తున్న ధోరణిపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాలకే కేంద్రం లాక్​డౌన్​ని ప్రకటించినా... ముఖ్యమంత్రి కేసీఆర్​ ముందుచూపుతో రాష్ట్రమంతటా కొనసాగిస్తున్నారని తెలిపారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులలో కరోనా వ్యాప్తి చర్యలు నామమాత్రంగా జరగడంపై యజమాన్యం ఏప్రిల్ 1 నుంచి లే ఆఫ్​ను ప్రకటించింది. దీంతో లక్షల్లో జీతాలు వచ్చే కార్మికులకు, కేవలం రూ.15000 చెల్లించి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. జగతికి వెలుగును పంచే చీకటి సూర్యులను, వేతనాల చెల్లింపు విషయంలో ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. కార్మికులు తమ న్యాయమైన వేతనాల కోసం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా కార్మిక సంఘం కట్టుబడి ఉంటుందని సింగరేణి యాజమాన్యాన్ని రాజిరెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా స్పందించి మార్చి నెలలోని పూర్తి, ఏప్రిల్ నెలలోని లే ఆఫ్ వేతనాలను చెల్లించాలని మిర్యాల రాజిరెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details