కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌ను సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకుడిగా ఉన్న రమేష్.. 2018లో ఖానాపూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు.
కాంగ్రెస్ నుంచి రమేష్ రాథోడ్ సస్పెన్షన్ - తెలంగాణ వార్తలు
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి వెల్లడించారు.
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు జిల్లా నాయకుల నుంచి టీపీసీసీకి ఫిర్యాదులు అందినట్లు కోదండరెడ్డి తెలిపారు. వాటిని పరిశీలించిన తర్వాతనే రమేష్ రాథోడ్‌ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసిన్నట్టు ఆయన ప్రకటించారు.