తెలంగాణ

telangana

ETV Bharat / state

REVANTH REDDY: 'ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయండి'

ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం తీసుకురావాలంటే ఉప ఎన్నికలు రావాల్సిందేనా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఇంద్రవెల్లిలో రేపు జరగనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

REVANTH REDDY: 'ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయండి'
REVANTH REDDY: 'ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయండి'

By

Published : Aug 8, 2021, 5:44 PM IST

Updated : Aug 8, 2021, 6:52 PM IST

ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లిలో రేపు జరగబోయే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులు, ఆదివాసీలు, దళితులకు విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్‌లోని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్​రెడ్డి నివాసానికి మాజీ మంత్రి షబ్బీర్‌ అలీతో కలిసి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లు, ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తదితర అంశాలపై చర్చించారు.

ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లపై చర్చ

'రాజకీయ లబ్ధి కోసమే దళిత బంధు'

ఈ సందర్భంగా హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిందని రేవంత్​రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకురావాలంటే ఉప ఎన్నికలు రావాల్సిందేనా అని ఆయన నిలదీశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉప ఎన్నికలు తీసుకురావాలని కోరుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత, గిరిజనులకు రూ. 10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

REVANTH REDDY: 'ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయండి'

'ఇస్తావా-చస్తావా' నినాదంతో కొట్లాడతాం

ఇంద్రవెల్లి సభతో ప్రారంభమయ్యే ఈ నిరసన కార్యక్రమాలు సెప్టెంబర్ 17 వరకు ఉంటాయని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. 'ఇస్తావా-చస్తావా' అనే నినాదంతో ప్రజల తరఫున ప్రభుత్వంతో కొట్లాడతామని వెల్లడించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు చెప్పారు.

రేపు జరగబోయే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను దిగ్విజయం చేయాల్సిందిగా కాంగ్రెస్​ శ్రేణులు, గిరిజనులకు విజ్ఞప్తి చేస్తున్నా. హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే దళిత బంధు పథకం తెచ్చినట్లు సీఎం కేసీఆర్​ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం తేవాలంటే ఉప ఎన్నికలు రావాలి. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉప ఎన్నికలు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఇస్తవా-చస్తవా అనే నినాదంతో మేము ముందుకెళుతున్నాం. ప్రజల తరఫున మేం ప్రభుత్వంతో కొట్లాడతాం. తెరాస ఎమ్మెల్యేలు ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి రూ.10 లక్షలు ఇప్పించాలి. లేదంటే రాజీనామా చేయాలి. అలా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అందరికీ ప్రయోజనం జరుగుతుంది. గత ఏడేళ్లుగా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​కు తగిన గుణపాఠం, జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యమకారుడు, తెలంగాణ బిడ్డల మీద ఉంది.

-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ప్రభుత్వానికి కనువిప్పు..

రేపు జరగనున్న సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రవెల్లి లాంటి సభలు రాష్ట్రంలో మరో నాలుగైదు ఏర్పాటు చేయాలని రేవంత్​రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు. రేపటి సభకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత కథనాలు..

ts politics: లక్షమందితో దళిత, గిరిజన దండోరా: రేవంత్‌రెడ్డి

Congress: 'దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాను విజయవంతం చేయండి'

కౌశిక్​ రెడ్డికే ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు.?: మల్లు రవి

Last Updated : Aug 8, 2021, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details