ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి దీని భారీన పడే వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఏడు కేసులు నమోదు కాగా... నిర్మల్ జిల్లాలో ఐదుగురికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
'వైరస్ విస్తరిస్తుంది... మైసమ్మ జాతరను రద్దు చేద్దాం' - కరోనా వ్యాప్తి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైరస్ విస్తరణ ఎక్కువగానే ఉంది. తాజాగా జిల్లాలో ఏడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 23కు చేరింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరగాల్సిన మైసమ్మ జాతరను రద్దు చేశారు.

'వైరస్ విస్తరిస్తుంది... మైసమ్మ జాతరను రద్దు చేద్దాం'
ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 23 మంది బాధితులు ఉండగా... నిర్మల్ జిల్లాలో 28మంది చికిత్స పొందుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 59 చేరింది. మరో 2 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి ధ్రువీకరించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో కరోనా నేపథ్యంలో మైసమ్మ జాతరను రద్దు చేశారు.