ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంశి కే గ్రామ శివారులో కలకలం సృష్టించిన పులి కదలికల దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. వారం రోజుల వ్యవధిలో అంతర్గావ్, కరంజీ అటవీ శివారు ప్రాంతంలో రెండు పశువులను హతమార్చింది. దాని అడుగులు కనిపించినా.. ఆనవాళ్లు కెమెరాలకు చిక్కలేదు.
తాజాగా మంగళవారం తాంశి శివారులో మరో రెండు పశువులను హతమార్చిగా... ఆ పులి కదలికలను పసికట్టడానికి అటవీ అధికారులు మరో ప్రయత్నం చేశారు. దాడి జరిగిన పరిసరాల్లో కెమెరాలు బిగించగా.. ఆవు కళేబరం తిన్న దృశ్యాలు కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. పులి కదలికలు నిర్ధరణ కావడం వల్ల స్థానికులు మరింతగా ఆందోళన చెందుతున్నారు.