తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దపులి కలకలం... కాపరి చూస్తుండగానే ఆవులమందపై దాడి - పెద్దపులి హల్​చల్​

పశువుల కాపరి చూస్తుండగానే... ఆలమందపై దాడి చేసిన పులి... ఆవును హతమార్చిన ఘటన ఆదిలాబాద్​ జిల్లా గొల్లఘాట్​ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వారం రోజుల్లోనే రెండో సారి ఆవులపై పెద్దపులి దాడి చేయటం... గ్రామాల్లో సంచరించటం... స్థానికులను వణికిస్తోంది.

TIGER ATTACK ON COWS IN ADILABAD DISTRICT FOREST
TIGER ATTACK ON COWS IN ADILABAD DISTRICT FOREST

By

Published : Feb 10, 2020, 9:26 PM IST

Updated : Feb 10, 2020, 11:57 PM IST

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సాయంత్రంవేళ ఆవుపై దాడి చేసి హతమార్చడం స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఆవులమందపై పులి దాడి చేసి ఆవును లాక్కెళ్లటాన్ని చూసిన పశువుల కాపరి భయంతో పరుగులు తీశాడు. గ్రామస్థులకు సమాచారమివ్వగా... అంతా కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించగా... చనిపోయిన ఆవు కన్పించింది.

ఉదయం పూట ఆర్టీసీ డ్రైవర్​కి పులి కనిపించిందన్న విషయం దావానంలా వ్యాపించింది. మధ్యాహ్నం వేళ సమాచారం అందుకున్న అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. మళ్లీ సాయంత్రం పులి దాడి చేయటం వల్ల ఘటన తెలిసి పరిసర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

వారం రోజుల కిందటే పులి దాడిలో ఆవు హతమైన ఘటన మరువక ముందే... తాజాగా మరో ఆవు చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. బేస్ క్యాంపు ఏర్పాటు చేసి తమ ప్రాణాలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. పెన్​గంగా సరిహద్దు ఆవల ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులులు తరచూ భీంపూర్ మండలం వైపు రావడం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.

పెద్దపులి కలకలం... కాపరి చూస్తూడగానే ఆవులమందపై దాడి

ఇదీ చూడండి:వేడుకలో పరిచయం.. వంచించి సామూహిక అత్యాచారం

Last Updated : Feb 10, 2020, 11:57 PM IST

ABOUT THE AUTHOR

...view details