ఆదిలాబాద్ జిల్లాలో కరోనా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రిమ్స్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ ఆదివారం ముగ్గురు బాధితులు మృతి చెందారు. ఈ మూడు మరణాలతో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 17కు చేరింది. పట్టణంలోని సప్తగిరిర కాలనీకి చెందిన 72 ఏళ్ల శంకరయ్య, భుక్తాపూర్ కాలనీకి చెందిన 67 ఏళ్ల గోపాల్ రావు, ఉట్నూరు మండలం సాకైక గ్రామానికి చెందిన 57 ఏళ్ల ఉత్తమ్ కరోనాతో మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాఠోడ్ తెలిపారు.
ఆదిలాబాద్‌లో 17కు చేరిన కరోనా మృతుల సంఖ్య! - Adilabad news
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం ముగ్గురు మృతి చెందారు. వీరితో కలిపి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది.
ఆదిలాబాద్‌లో 17కు చేరిన కరోనా మృతుల సంఖ్య!
జిల్లాలో ఇప్పటి వరకు 9,361 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 981 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 570 మంది కోలుకున్నారు. మరో 397 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. రోజురోజుకు జిల్లాలో పరీక్షలు పెంచుతున్నా కొద్దీ.. బాధితుల సంఖ్య కూడా పెరుగుతుండటం జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తున్నది.
ఇదీ చూడండి:గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!