తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ వెళ్లిన వారికి పరీక్షలు చేయించాలి: సోయం బాపూరావు - latest news on mp soyam bapu rao

ఆదిలాబాద్​ జిల్లా నుంచి దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఎంపీ సోయం బాపూరావు అధికారులను కోరారు. వారిని వెంటనే క్యారంటైన్​కు తరలించాలన్నారు.

Those who go to Delhi should be tested: Soyam Bapurao
దిల్లీ వెళ్లిన వారికి పరీక్షలు చేయించాలి: సోయం బాపూరావు

By

Published : Apr 2, 2020, 11:52 AM IST

దిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు చేసి క్వారంటైన్‌కు తరలించాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు జిల్లా యంత్రాంగాన్ని కోరారు. జిల్లా సరిహద్దులోని బోరజ్‌ చెక్‌పోస్టు వద్ద నిలిచిపోయిన పలువురు వలస కూలీలను ఆయన పరామర్శించారు. వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

వలస కూలీలందరికీ 12 కేజీల బియ్యంతో పాటు రూ.500 అందేలా చూస్తామన్నారు. మరోవైపు సీపీఎం ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌ కాలనీవాసులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:కరోనాతో గాంధీలో వ్యక్తిమృతి... వైద్యులపై బంధువుల దాడి

ABOUT THE AUTHOR

...view details