ఆదిలాబాద్‌లోని జిట్ట అశోక్ ఇంట్లో జరిగిన చోరిలో 10 లక్షల నగదు, మూడు తులాల బంగారం చోరీకి గురైనట్టు కుటుంబీకులు తెలిపారు. అశోక్ రెండు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా... కుటుంబమంతా వారి సొంతూరు తాంసి మండలం గోట్కూరి వెళ్లారు. ఇంకా ఆ దుఃఖం నుంచి తేరుకోకముందే ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలోని వారి ఇంట్లో దొంగతనం జరిగిందన్న వార్త వారిని చేరింది.
ఇంట్లో విషాదం మరువక ముందే మరో ఘటన - latest news of adilabad
రెండు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో ఇంటిపెద్ద చనిపోగా.. ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఇంట్లో దొంగలు పడి భారీ నగదు దోచుకుపోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ చోటుచేసుకుంది.
విషాదం మరుక ముందే మరో ఘటన
పెద్ద కూతురు పెళ్లికి దాచుకున్న నగదుతో పాటు బంగారం చోరికి గురికావడం వారిని మరింత ఆవేదనకు గురిచేసింది. విషయం తెలిసుకున్న సీఐ పురుషోత్తమచారి ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో వివరాలు సేకరింస్తున్నారు.
ఇవీ చదవండి...విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...!