తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్ జిల్లాలో కన్నుల పండువగా తీజ్ ఉత్సవాలు

ఆదిలాబాద్ జిల్లాలో కన్నుల పండువగా తీజ్ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. లంబాడా యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకలో ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడారు.

theej
theej

By

Published : Aug 11, 2020, 11:05 PM IST

ఆదిలాబాద్ జిల్లాలోని బంజారాలు సాంప్రదాయబద్ధంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. తీజ్ ఉత్సవాలతో తండాలో పండుగ వాతావరణం నెలకొంది. పెళ్లి కాని యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి తీజ్‌లకు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటూ ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు.

ఈ సంబురాలు నిర్వహించడం వల్ల యువతులకు మంచి భర్త రావడంతో పాటు తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయని వారి నమ్మకం.

ABOUT THE AUTHOR

...view details