తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్‌లో ఈదురుగాలుల బీభత్సం - ఆదిలాబాద్‌లో ఈదురుగాలుల బీభత్సం

ఆదిలాబాద్‌ జిల్లా బజార్​ హత్నూర్ మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగపోవటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

The Rise of Tornadoes in Adilabad
ఆదిలాబాద్‌లో ఈదురుగాలుల బీభత్సం

By

Published : Mar 15, 2020, 12:03 PM IST

ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలంలో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. మండల కేంద్రంతోపాటు మడగూడ, కోలారి తదితర గ్రామాల్లో రబీ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 5 నిమిషాల పాటు వీచిన ఈదురుగాలులకు ఇళ్లపై రేకులు ఎగిరిపోయి ఇంట్లో వస్తువులపై రాళ్లు పడ్డాయి.

ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. పంట ధాన్యాలు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.

ఆదిలాబాద్‌లో ఈదురుగాలుల బీభత్సం

ఇదీ చూడండి :కరోనా భయంతో డీమార్ట్​లో పరీక్షలు!

ABOUT THE AUTHOR

...view details