శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఉట్నూర్ డీఎస్పీ డేవిడ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని పోలీసు స్టేషన్లో ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ పాల్గొన్నారు. గ్రామస్థులందరు చొరవ తీసుకుని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆటోఅడ్డాలను ఏర్పాటు చేస్తామని, రైతు బజార్ కోసం ప్రత్యామ్నాయంగా స్థలాన్ని గుర్తించాలని డీఎస్పీ కోరారు.
శాంతి భద్రతల పరిరక్షణ ప్రజలందరి బాధ్యత - The protection of peacekeepers is the responsibility of all people
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని సీఐ కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో డీఎస్పీ డేవిడ్ సమావేశమయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పలు సూచనలు చేశారు.
![శాంతి భద్రతల పరిరక్షణ ప్రజలందరి బాధ్యత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4302283-thumbnail-3x2-ppp.jpg)
The protection of peacekeepers is the responsibility of all people