తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్టాదారు పాసుపుస్తకాలు చూపిస్తే వదిలేస్తాం' - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్తలు

లాక్​డౌన్​ సమయంలో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆదిలాబాద్​ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు చూపిస్తే వాహనాలు స్వాధీనం చేసుకోబోమని స్పష్టం చేశారు.

The police advise that farmers
'పట్టాదారు పాసుపుస్తకాలు చూపిస్తే వదిలేస్తాం'

By

Published : Apr 12, 2020, 3:14 PM IST

వ్యవసాయ పనులు నిమిత్తం రోడ్లపైకి వచ్చే రైతులు... కచ్చితంగా తమ వెంట పట్టాదారు పాసుపుస్తకాలు తెచ్చుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. లాక్​డౌన్​ కాలంలో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా ఆదిలాబాద్‌ పోలీసు యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

వ్యవసాయ పనుల కోసం పట్టణ పరిధిలోకి వచ్చే రైతులు పట్టాదారు పాసుపుస్తకం వెంట తెచ్చుకోవాలని... వాటిని చూపిస్తే రైతుల వాహనాలను స్వాధీనం చేసుకోబోమని స్పష్టం చేశారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు పాసులు జారీ చేసినట్లు తెలిపారు. ఎరువుల దుకాణాలు, వ్యవసాయ పనిముట్ల మరమ్మతు షాపులు తెరిచి ఉంటాయని వెల్లడించారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి వస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

'పట్టాదారు పాసుపుస్తకాలు చూపిస్తే వదిలేస్తాం'

ఇదీ చూడండి :ఎగ్జిబిషన్​ మైదానంలో అన్నీ ఫ్రీ

ABOUT THE AUTHOR

...view details