తెలంగాణ

telangana

'రైతులతో కలిసి ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం'

By

Published : Jan 11, 2021, 5:56 PM IST

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ నిరసన చేపట్టింది. కొత్త చట్టాలను రద్దు చేయకుంటే .. గ్రామగ్రామాన తిరిగి ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు.

The Congress staged a protest in front of the Adilabad Collectorate
'రైతులతో కలిసి ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం'

వ్యవసాయ చట్టాల రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత, పార్టీ ఇన్‌ఛార్జ్ జిల్లా అధ్యక్షుడు సాజీద్‌ఖాన్‌ ఆ పార్టీ శ్రేణులతో కలసి కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లే యత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన పోలీసులు, ఆ పార్టీ నేతల మధ్య ఘర్షణకు కారణమైంది.

ప్రభుత్వం దిగిరాకపోతే..

ఫ్లకార్డులు పట్టుకుని కొత్త చట్టాల విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల తీరుని దుయ్యబట్టారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఈనెల 26 నుంచి రైతులతో కలిసి.. అన్ని గ్రామాల్లో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి:'మీరు పరిష్కరిస్తారా? చట్టాలపై మేము స్టే విధించాలా?'

ABOUT THE AUTHOR

...view details