తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు వెంటనే చెల్లించాలి: సీపీఐ

రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారాలు, బకాయిలను కేంద్రం వెంటనే చెల్లించాలని భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో ఈ విషయమై జిల్లా కార్యదర్శి దుర్గం నూతన కుమార్​ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

The Communist Party of India submitted a petition to the adilabad Collector to pay the GST arrears
'రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు వెంటనే చెల్లించాలి'

By

Published : Sep 8, 2020, 4:32 PM IST

జీఎస్టీ ప్రారంభమైన కొత్తలో రాష్ట్రాలకు కష్టం వస్తే కొంత కాలం పాటు వాటిని కేంద్రమే భరిస్తుందని చెప్పారని సీపీఐ (భారతీయ కమ్యూనిస్టు పార్టీ) గుర్తుచేసింది. చట్టంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి రావలసిన జీఎస్టీ పరిహారాలను చెల్లించాలంటూ ఆదిలాబాద్​ కలెక్టరేట్​ వద్ద సీపీఐ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు.

కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి.. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుర్గం నూతన కుమార్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి, దుర్గం లింగం, లింగన్న, విలాస్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details