ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంద్రవెల్లి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి మనోహర్ ఇంద్రవెల్లి పీహెచ్సీ, వైద్య సిబ్బందితో మండలంలోని మార్కాపూర్ పంచాయతీ పరిధిలోని మామిడి గూడా గ్రామానికి చేరుకున్నారు. ఊర్లోకి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడం, అధిక వానలతో రెండు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
వాగులను లెక్క చేయకుండా...
పొంగిపొర్లి ప్రవహిస్తున్న వాగులను సైతం లెక్క చేయకుండా జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ వైద్య సిబ్బందితో ప్రమాదకరంగా ఉన్న వాగులను దాటి బాధితురాలిని చేరుకున్నారు. అనంతరం అక్కడికి చేరుకొని ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈనాడు- ఈటీవీ భారత్లో ప్రచురితమైన వార్తకు స్పందించి ఆ ప్రాంత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
మందులే కాదు... సూచనలు కూడా