ఎన్నికల విధుల్లో భాగంగా వేరే జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తించిన తహసీల్దార్లు సొంత జిల్లాలకు తిరిగి వచ్చారు. రెండు రోజుల క్రితం రాష్ట్రం ప్రభుత్వం తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ సోమవారం రాత్రి తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్‌గా భోజన్న బాధ్యతలు స్వీకరించారు. పుష్పగుచ్ఛం అందించి సిబ్బంది ఘనస్వాగతం పలికారు. జిల్లావ్యాప్తంగా 18 మంది తహసీల్దార్లు ఉండగా... 15 మంది ఆయా మండలాల్లో విధుల్లో చేరారు.
సొంత జిల్లాలో తహసీల్దార్ల బాధ్యతల స్వీకరణ - thahasildars taken charge in adilabad
ఆదిలాబాద్ జిల్లాలో తహసీల్దార్లకు కలెక్టర్ దివ్యాదేవరాజన్ పోస్టింగ్‌లు ఇచ్చారు. 15 మంది బాధ్యతలు స్వీకరించారు. ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్‌గా భోజన్న విధుల్లో చేరారు.
![సొంత జిల్లాలో తహసీల్దార్ల బాధ్యతల స్వీకరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5117081-thumbnail-3x2-tah.jpg)
సొంత జిల్లాలో తహసీల్దార్ల బాధ్యతల స్వీకరణ