తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వేచ్ఛగా ఓటు వేసేందుకే నిర్బంధ తనిఖీలు - 15 TWO WHEELERS

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్​ శాఖ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవడానికే నిర్బంధ తనిఖీలు చేపడుతోంది.

సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

By

Published : Mar 27, 2019, 5:14 PM IST

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్బంధ తనిఖీలు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడేగామ(కె) గ్రామంలో తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ మోహన్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో పాటు బీఎస్ఎఫ్ సిబ్బంది ఇళ్లలో సోదాలు జరిపారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు నిర్బంధ తనిఖీలు చేపట్టామని అదనపు ఎస్పీ తెలిపారు. గ్రామాల్లో ఓటర్లను మద్యం, డబ్బుతో ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి :భారత్ మరో మైలురాయి... 'మిషన్​ శక్తి' సఫలం


ABOUT THE AUTHOR

...view details